Skip to main content

Posts

test

ఎన్నిసార్లు గుర్తుకుతెచ్చుకున్నానో ఈ పద్యాన్ని. తెలుగు బ్లాగులను అలా ఉబుసుపోక చదివిన ప్రతిరోజూ కనీసం ఒక్కసారి ఈ పద్యం గుర్తుకు వస్తుంది . అసలే శ్రీనాథుడు. ఎర్రగారం తో సంకటి తిని ఒక పక్కన గొంతు మండిపోతున్నా, గంగకోసం పరమేశ్వరనితో పరాచికాలాడగల సమర్థుడు. అలాంటివాడు వ్రాసిన భీమేశ్వరపురాణం అన్న కావ్యాన్ని రాణ్మహేంద్రవరం పండితులు ఈర్ష కొద్దీ శుష్కవాదాలు చేసి తీవ్రంగా విమర్శించారట. మరి శ్రీనాథుడు ఊరుకుంటాడా? వారినుద్దేశించి క్రింది చాటు పద్యాన్ని చెప్పాడు. పద్యం అంటే అలాంటిలాంటి పద్యం కాదు. వెటకారాన్ని, వ్యంగ్యాన్ని ఇంత కసిగా వ్యక్తీకరించే పద్యం గానీ, వాక్యం గానీ నేను చూడలేదు. కొంచెం సున్నితమనస్కులకు, సంస్కారవంతులకూ పద్యం చదివేక జుగుప్సాకరం గా అనిపించొచ్చునేమో (ఏమో ఏమేమో అన్న ఊహాగానాలెందుకంటే - నేను సున్నితమనస్కుడినీ కాను, సంస్కారవంతుడిని అసలే కాను కాబట్టి). కానీ మనకేమనిపిస్తుందన్న విషయం పక్కన పెట్టి, ఒక్కసారి శ్రీనాథుని ప్రత్యర్థులకేమనిపించుంటుందని ఆలోచిస్తూ చదవాలి ఈ పద్యాన్ని నా సామిరంగా...నా పదకొండేళ్ళ కజిన్ భాషలో - "స్పైడర్-మాన్-కేక!" ( అంటే స్పైడర్ మాన్ అంత కేక అన్నమాట. మావోడు చ